బాలీవుడ్ నటుడు షారూఖ్‌ఖాన్ అత్యవసర కంటి చికిత్స కోసం అమెరికా వెళ్తున్నట్లు బాలీవుడ్‌లో వినిపిస్తోంది. ఆయన కంటి సమస్యతో ముంబైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లగా, అక్కడి వైద్యులు అమెరికా వెళ్లాలని సూచించినట్లు సమాచారం. దీంతో నేడు షారూఖ్ అమెరికా వెళ్లనున్నుట్లు తెలుస్తోంది. ఆయన ప్రస్తుతం కింగ్ చిత్రంలో నటిస్తున్నారు.