ఏపీ, తెలంగాణలో ఇప్పుడు ఇద్దరు ఐఏఎస్ మహిళా ఆఫీసర్ల గురించే చర్చ జరుగుతోంది. వాళ్లే స్మితా సభర్వాల్, ఆమ్రపాలి కాటా. తెలంగాణ గవర్నమెంట్‌లో ఇద్దరూ తమ మార్క్‌ను చూపించుకునే ఆఫీసర్లు. ఎక్కడ పని చేసినా ఎవరి స్టైల్లో వాళ్లు దూసుకుపోతారు.డైనమిక్ ఐఏఎస్ అధికారులుగా పేరు తెచ్చుకున్న ఇద్దరు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. తమకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంటారు. కేసీఆర్ గవర్నమెంట్‌లో స్మితా సబర్వాల్ ఆధిపత్యం చెలాయించగా.. రేవంత్ రెడ్డి సర్కార్‌లో ఆమ్రాపాలికి పాధాన్యత దక్కింది. కానీ.. ఇప్పుడు వేరువేరు రాష్ట్రాల్లో ఒకే పోస్టింగ్‌లో ఇద్దరూ ఉండడం విశేషం.ఇటీవల ఏపీలో రిపోర్ట్ చేసిన ఆమ్రపాలికి టూరిజం ఎండీగా నియమించింది చంద్రబాబు ప్రభుత్వం. అదే టైంలో తాజాగా జరిగిన ఐఏఎస్ బదిలీల్లో స్మితా సభర్వాల్‌కు టూరిజం సెక్రటరీగా తెలంగాణ ప్రభుత్వం బాధ్యతలు అప్పజెప్పింది. టూరిజంలో అక్కడ ఆమ్రపాలి.. ఇక్కడ స్మితా సభర్వాల్ ఇద్దరూ పోటాపోటీగా పనిచేసి మరోసారి తమ మార్క్ చూపించుకుంటారా అనేది చూడాలి .