Current Date: 26 Nov, 2024

నటి కస్తూరి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు

తెలుగు వారి పట్ల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సినీనటి కస్తూరిని అదుపులోకి తీసుకునేందుకు రెండు ప్రత్యేక పోలీసు బృందాలు ఏర్పాటయ్యాయి. ఈ నెల 3వ తేదీ ఎగ్మూర్‌ రాజరత్నం స్టేడియం సమీపంలో హిందూ మక్కల్‌ కట్చి ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో నటి కస్తూరి తెలుగు వారి పట్ల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో పలు తెలుగు సంఘాలు కస్తూరి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించాయి. రాష్ట్రంలోని పలు పోలీస్‏స్టేషన్లలో కస్తూరిపై కేసులు నమోదయ్యాయి. దీంతో ఆమె ముందస్తు బెయిలు కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో, కస్తూరిని అరెస్ట్‌ చేసేందుకు ఏర్పాటైన రెండు పోలీసు బృందాలు ఆమె కోసం గాలిస్తున్నాయి.

Share