Current Date: 05 Oct, 2024

ఆంధ్రా కు అగ్ర తాంబూలం

కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రాధాన్యత కన్పించింది. రాజధాని అభివృద్ధికి నిధులు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును త్వరగా పూర్తి చేస్తామని స్పష్టం చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.కేంద్ర బడ్జెట్ 2024లో ఆంధ్రప్రదేశ్ కు గుడ్ న్యూస్ అందించారు ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. ఏపీ రాజధాని అభివృద్ధికి 15 వేల కోట్లను బడ్జెట్లో కేటాయించగా పోలవరం ప్రాజెక్టు త్వరలో పూర్తి చేస్తామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు ఏపీకు జీవనరేఖ అని నిర్మలా సీతారామన్ అభివర్ణించారు. రాష్ట్రంలోని రాయలసీమ, ఉత్తరాంధ్ర, ప్రకాశం జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు.రాష్ట్రంలోని పారిశ్రామిక కారిడార్లను అభివృద్ధి చేస్తామని నిర్మలా సీతారామన్ తెలిపారు. విశాఖపట్నం-చెన్నై పారిశ్రామిక కారిడార్, ఒర్వకల్లు-బెంగళూరు పారిశ్రామిక కారిడార్లకు నిధులు కేటాయిస్తామన్నారు. ఏపీ విభజన చట్టానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటామన్నారు. అమరావతి నిర్మాణానికి బహుళ సంస్థల ద్వారా నిధులు కేటాయించడమే కాకుండా ఏపీలో పరిశ్రమల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు

Share