Current Date: 06 Oct, 2024

సీనియర్లకు షాక్‌.. అయ్యో! అయ్యన్న!

జిల్లాలోని సీనియర్లు షాక్‌కు గురయ్యారు. ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వంలో అనేక ఇబ్బందులకు గురయిన చింతకాయల అయ్యన్న పాత్రుడికి మంత్రి వర్గంలో స్థానం దక్కలేదు. నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున పదోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి 7సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. తొలిసారిగా జగన్‌ను వ్యక్తిగతంగా దూషించి టీడీపీ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపిన ఘనత అయ్యన్నకే దక్కింది. చంద్రబాబు కన్న పార్టీలో తానే సీనియర్‌నని చెప్పుకునే అయ్యన్నకు మంత్రివర్గంలో స్థానం దొరక్కపోవడంతో కంగుతినాల్సి వచ్చింది.

Share