Current Date: 26 Nov, 2024

సైలెంట్‌గా చిన్న కూతురు పెళ్లి చేసేసిన హీరో వెంకటేష్!

సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ ఇటీవల తన రెండో కుమార్తె ‘హవ్యవాహిని’కి పెళ్లి చేసి అత్తవారింటికి పంపించిన సంగతి తెలిసిందే. విజయవాడ డాక్టర్ కుటుంబానికి చెందిన డాక్టర్ నిశాంత్ అనే కుర్రాడికి వెంకటేష్ తన కుమార్తెని ఇచ్చి పెళ్లి చేసారు.

ఈ పెళ్లిని, ఎంగేజ్మెంట్‌ని వెంకీ మామ చాలా సింపుల్ గా చేసేసారు. ఎటువంటి హడావుడి లేకుండా, పెద్ద ఈవెంట్, సెలబ్రేషన్స్ లేకుండా వెంకటేష్ తన కూతురు వెడ్డింగ్ ని పూర్తి చేసేసారు. ఇక ఈ పెళ్లికి సంబంధించిన రిసెప్షన్‌ని వరుడు కుటుంబం విజయవాడలో గ్రాండ్‌గా నిర్వహించారు.

ఈ రిసెప్షన్ లో ఇండియన్, కాంటినెంటన్, ఆసియన్, ఇటాలియన్ ఫుడ్స్ తో గుమగుమలాడించారు. వెజ్ అండ్ నాన్ వెజ్ లో స్పెషల్ డిషెస్ తో అతిథులకు నోరూరించారట.