పవన్ కళ్యాణ్‌పై పిఠాపురంలో ఓ ట్రాన్స్‌జెండర్ పోటీకి సిద్ధమయ్యారు. బిగ్ బాస్ ఫేమ్, ట్రాన్స్‌జెండర్ తమన్నా సింహాద్రి.. పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. బీసీవై (భారత చైతన్య యువజన పార్టీ) తరఫున ఆమె బరిలోకి దిగనున్నారు. బీసీవై పార్టీ జాబితాలో తమన్నా సింహాద్రి పేరును పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ ప్రకటించారు. గత ఎన్నికల్లో ఇదే తమన్నా సింహాద్రి.. మంగళగిరిలో నారా లోకేష్‌పై పోటీ చేశారు.
కామెడీ ఏంటంటే? తమన్నా సింహాద్రి గతంలో జనసేన పార్టీలో పనిచేశారు. జనసేన పార్టీ తరఫున గత ఎన్నికల్లో మంగళగిరి సీటు ఆశించారు. సీటు ఇవ్వకపోవడంతో ఇండిపెండెంట్‌గా పోటీ చేశారు. ఎన్నికల తర్వాత కూడా పవన్ కళ్యాణ్‌కు మద్దతుగానే మాట్లాడారు. అయితే, టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకున్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్‌పై తమన్నా విమర్శలు కురిపించడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఏకంగా ఆయనపైనే పోటీకి దిగి మరో సంచలనానికి తెర తీశారు.
పిఠాపురంలో పవన్ కళ్యాణ్‌పై పోటీకి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సైతం మహిళా నేత వంగా గీతని రంగంలోకి దించిన సంగతి తెలిసిందే. వీరిద్దరి మధ్యే ప్రధానంగా పోటీ ఉండనుంది. అయితే, ఇప్పుడు ట్రాన్స్‌జెండర్ తమన్నా సింహాద్రి కూడా నేనున్నానంటూ పిఠాపురంలో బరిలోకి దిగుతున్నారు.