Current Date: 06 Oct, 2024

లేడీ రిపోర్టర్‌కి హీరో రాజ్‌తరుణ్ కౌంటర్.. లావణ్య ఇష్యూపై సైలెంట్

టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ గత నెల రోజులుగా వరుస వివాదాల్లో కనిపిస్తున్నాడు. అతని మాజీ ప్రేయసి లావణ్య ఇష్యూతో తెరపైకి వచ్చిన రాజ్ తరుణ్ సినిమాల రిలీజ్ కంటే పర్సనల్ వ్యవహారాలతోనే ఇటీవల వార్తల్లో నిలుస్తూ వచ్చారు. ఇటీవల విడుదలైన రాజ్‌తరుణ్ సినిమాలుపురుషోత్తముడు,తిరగబడరాసామీ డిజాస్టర్‌గామిగిలాయి. రెండు నెలల గ్యాప్‌లోనే మూడోసినిమా ‘భలే ఉన్నాడే’తో సెప్టెంబరు 7న థియేటర్లలోకి రాబోతున్నాడు. ఈ క్రమంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో లేడీ రిపోర్టర్లు అడిగిన పర్సనల్ విషయాల మీద కౌంటర్లు వేశాడు. పెళ్లి మీదకాంట్రర్సలు జరుగుతున్నాయి.. అసలు మీకు ఎన్ని పెళ్లిళ్లు అయ్యాయి.. అంటూ ఇలా ఓ లేడీ రిపోర్టర్ ప్రశ్నను అడిగారు. చెప్పను సిస్టర్ అంటూ రాజ్ తరుణ్ కౌంటర్ వేశాడు. మరో లేడీ రిపోర్టర్ మళ్లీ లావణ్య ఇష్యూని అడిగేసింది. సినిమాల కోసం కావాలనే లావణ్య ఇష్యూని బయటకు తీసుకు వచ్చి ఇద్దరూ కలిసి ప్రమోషన్స్ చేశారా? అని అడిగేసింది. దీంతో రాజ్ తరుణ్ షాక్ అయ్యాడు. 

Share