Current Date: 01 Oct, 2024

కాన్పూర్ టెస్టులో టీమిండియా రికార్డుల మోత.. ఆల్‌టైమ్ రికార్డ్

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఆటగాళ్లు రికార్డుల మీద రికార్డులు నెలకొల్పారు. స్పిన్నర్ అశ్విన్ టెస్టు క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో 50కు పైగా వికెట్లు తీసిన తొలి బౌలర్ గా నిలిచి చరిత్ర సృష్టించాడు అశ్విన్. మూడు డబ్ల్యూటీసీ ఛాంపియన్ షిప్ లలో అశ్విన్ 50కుపైగా వికెట్లు తీశాడు. మరోవైపు మరో ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా కెరీర్‌లో 300వ టెస్ట్ వికెట్ తీసి అరుదైన ఘనత సాధించాడు. టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ- యశస్వీ జైస్వాల్ కూడా రికార్డు సృష్టించారు. టెస్టు క్రికెట్ చరిత్రలో వేగవంతమైన అర్ధ శతకం నమోదు చేసిన జోడీగా చరిత్ర సృష్టించారు. బంగ్లాదేశ్ తో జరుగుతున్న రెండో టెస్టులో తొలి ఇన్నింగ్సులో ఈ జోడీ బంగ్లా బౌలర్లపై ఎదురుదాడికి దిగింది. కేవలం 18 బంతుల్లోనే 51 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. సుదీర్ఘ ఫార్మట్ లో ఇది వేగవంతమైన అర్ధ శతకంగా నిలిచింది.

Share