Current Date: 26 Nov, 2024

ఆంధ్ర ప్రదేశ్ లో ఇక నుంచి రూ.99ల క్వార్టర్ బాటిల్ కూడా లభ్యం

ఏపీలో నూతన ఎక్సైజ్ పాలసీలో భాగంగా ప్రైవేటు మద్యం షాపులు అందుబాటులోకి వచ్చాయి. అయితే ప్రభుత్వం ప్రకటించిన విధంగా చౌక ధర మద్యం పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాకపోవడంతో మందు బాబులు నిరుత్సాహానికి గురవుతున్నారు. ప్రైవేటు మద్యం షాపుల్లో వివిధ రకాల బ్రాండ్లు అందుబాటులో ఉన్నా ప్రభుత్వం ప్రకటించిన రూ.99ల క్వార్టర్ బాటిళ్ల మద్యం అందుబాటులో లేకపోవడంతో షాపుల నిర్వాహకులతో మందుబాబులు గొడవ పడుతున్నారు. దీంతో రాష్ట్ర ఎక్సైజ్ అధికారి మందు బాబులకు గుడ్ న్యూస్ అందిస్తూ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన విధంగా రూ.99లకు క్వార్టర్ బాటిల్ మద్యం అందుబాటులోకి వచ్చిందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ సంచాలకులు నిశాంత్ కుమార్ తెలిపారు. మద్యం తయారీ విక్రయాలలో జాతీయ స్థాయిలో పేరు ప్రతిష్టలు కలిగిన ఐదు సంస్థలు ఆంధ్రప్రదేశ్‌లో ఈ ధరకు మద్యం విక్రయాలు చేసేందుకు సిద్దం అయ్యాయని తెలిపారు.

Share