Current Date: 26 Nov, 2024

ఏపీలో ఈరోజు నుంచి కొత్త లిక్కర్ పాలసీ అమలు రూ.99కే క్వార్టర్!

ఏపీలో కొత్త మద్యం పాలసీ బుధవారం నుంచి అమల్లోకి వస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు మద్యం షాపులు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలో ప్రతి షాపు నుంచి వారం రోజులకు సరిపడా మద్యం నిల్వల కోసం లైసెన్సులు దక్కించుకున్నవారు ఏపీఎస్‌బీసీఎల్‌కు ఆర్డర్లు పెట్టారు. ఈ మద్యం విలువ దాదాపు రూ.350 కోట్ల నుంచి రూ.400 కోట్ల వరకూ ఉంటుందని చెబుతున్నారు.ఏపీలో మద్యం షాపులకు లిక్కర్ ఆర్డర్ల కోసం ఎక్సైజ్‌ శాఖ లైసెన్సులు దక్కినవారికి ప్రత్యేకంగా లాగిన్‌ ఐడీలు కేటాయించింది. నేటి నుంచి మందుబాబులు కోరుకునే అన్ని రకాల బ్రాండ్లు అందుబాటులోకి వస్తాయి. షాపుల లైసెన్సులు దక్కించుకున్నవారు ఆర్డర్లు పెట్టిన రకాలను ఏపీఎస్‌బీసీఎల్ సరఫరా చేయనుంది. దేశవ్యాప్తంగా లభించే అన్ని బ్రాండ్లను వారం రోజుల్లో అందుబాటులోకి వస్తాయని చెబుతున్నారు.రూ.99కే క్వార్టర్‌ మద్యం విక్రయిస్తామని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.. అయితే నాలుగు నేషనల్‌ కంపెనీలు ఆ ధరలో అందించేందుకు సిద్ధమయ్యాయి. ఈ మద్యం కూడా రెండు మూడు రోజుల్లో అందుబాటులోకి వస్తుందంటున్నారు.

Share