Current Date: 06 Jul, 2024

9849903818 ఈ నెంబరు ఎవరిదో తెలుసా ?

9849903818... ఈ నెంబరు ఎవరిదో చాలా మందికి తెలిసే వుంటుంది. ముఖ్యంగా విశాఖ రెవెన్యూ శాఖ కు సంబంధించి లావాదేవీలు నడిపే అందరికీ ఈ నెంబరు సూపరిచితం.కలెక్టర్ సీసీ గా పనిచేసి షాడో కలెక్టర్ గా అనేక అక్రమాలకు కేంద్ర బిందువుగా నిలిచిన నగేష్ ఇప్పుడు అసైన్డ్ భూములను ఫ్రీహోల్డ్ చేసే విషయంలో కూడా కీలక పాత్ర వహించాడు. కలెక్టర్ మల్లికార్జున కు ఆత్మగా పని చేస్తూ వేలకోట్ల రూపాయల ప్రభుత్వ భూముల్ని దళారీలా చేతుల్లోకి బదలాయించేడం లో కీలక పాత్ర వహిస్తున్న నగేష్ దందాలపై ఏడాది క్రితం 'లీడర్ ' వరస కధనాలను ప్రచురించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నగేష్ ను అప్పుడే ఎన్.హెచ్-5డీ టి గా బదిలీ చేసేసి తను సచ్ఛాలడినని. మల్లికార్జున చెప్పుకోవాలనుకున్నా రు. అయితే సీసీ హోదాలో అధికారికంగావాడాల్సిన ఫోన్ నెంబర్ 9849903818 ని మాత్రం నగేష్ దగ్గరే వుంచేశారు. ఎందుకంటే అక్రమ లావాదేవీలు నడిపేదంతా ఈ ఫోన్ ద్వారానే అన్నది అందరికీ తెలుసు. ఉద్యోగం ఏన్ హెచ్ -5 లో చూపిస్తున్న నగేష్ మాత్రం అర్ధ రాత్రి అయ్యేసరికి కలెక్టర్ బంగ్లా కు చేరిపోతాడు. అక్రమ లావాదేవీల సెటలెమెంట్లు అక్కడే రూపాకల్పనచేసుకుంటాడు. అక్కడి నుంచి షాడో కలెక్టర్ అవతారం లో తహసీల్దార్ పై పెత్తనం చెలయిస్తాడు. వేల కోట్ల విలువైన భూముల బదలాయింపులో కీలక పాత్ర పోషిస్తుంటాడు. అందుకే కదా 9849903818 ఫోన్ నెంబర్ ఇప్పుటికి నగేష్ దగ్గరే వుంది.