దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంటోంది. ఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యం నేపథ్యంలో ఢిల్లీ నగరమంతటా ప్రాథమిక పాఠశాలలు ఆన్‌లైన్ మోడ్‌కు మారిపోయాయి. ఆఫ్‌లైన్‌లో తరగతులకు హాజరయ్యే 6వ తరగతి అంతకంటే ఎక్కువ తరగతి విద్యార్థుల కోసం ఢిల్లీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఢిల్లీ స్కూళ్లలో హాజరయ్యే విద్యార్థులకు మార్గదర్శకాలను అమల్లోకి తీసుకొచ్చింది. ప్రధానంగా అవుట్‌డోర్ కార్యకలాపాలు పరిమితం చేసింది. చదవడం, పెయింటింగ్, క్రాఫ్టింగ్ వంటి ఇండోర్ కార్యకలాపాలు, చెస్, క్యారమ్ వంటి ఆటలను ప్రోత్సహిస్తున్నారు. కార్‌పూలింగ్, హైడ్రేటెడ్‌గా ఉండటం, యాంటీఆక్సిడెంట్‌లు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వంటి అనేక సూచనలు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఒక అడ్వైజరీ కూడా ఢిల్లీ స్కూళ్లు జారీ చేశాయి.