Current Date: 27 Nov, 2024

నిశ్చితార్థం తర్వాత 9 ఏళ్లకి హీరోయిన్ పెళ్లి

ఎవరైనా నిశ్చితార్థం చేసుకున్న కొన్ని నెలల్లో కుదరకపోతే కనీసం ఏడాది వ్యవధిలోనైనా పెళ్లి చేసుకుంటారు. కానీ హీరోయిన్ తాప్సీ మాత్రం ఏకంగా 9 ఏళ్ల కిందట నిశ్చితార్థం చేసుకొని ఇప్పుడు పెళ్లి చేసుకుంది. డెన్మార్క్‌కు చెందిన మథియాస్ బోతో 9 ఏళ్ల కిందట తాప్సీ ఎంగేజ్ మెంట్ అయ్యింది. వాళ్లు గత 11 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో 9 ఏళ్ల కిందట ఉంగరాలు మార్చుకోగా.. ఇటీవల పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత కూడా తాప్సి తన కెరీర్‌ను నిరాటంకంగా కొనసాగిస్తోంది. పిల్లల్ని ఎప్పుడు కనాలనే అంశంపై తామిద్దరం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదంటోంది. టాలీవుడ్‌లో ఒక వెలుగు వెలిగిన తాప్సీ నోటిదురుసు కారణంగా అవకాశాల్ని పోగొట్టుకుని బాలీవుడ్‌కి వెళ్లింది. అక్కడా సక్సెస్ కాలేకపోయింది.

Share