గోదావరి జిల్లాల్లో అల్లుడుని ఎంత బాగా చూసుకుంటారో మరోసారి సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. సాధారణంగా అల్లుడుకి తినడానికి ఎన్నో రకాల వంటకాలు సిద్ధం చేస్తుంటారు. కానీ కాకినాడలో ఆషాడం ముగిసిన తర్వాత మొదటిసారి ఇంటికి వస్తున్న అల్లుడికి ఓ అత్త వంటకాలతో ఆశ్చర్యపరిచింది. కాకినాడ జిల్లా కిరాలం మండలం తామరాడ గ్రామంలో ఓ అత్త తన అల్లుడు రవితేజకు 100 రకాల వంటకాలతో ఘనంగా స్వాగతం పలికింది. అల్లుడు, కూతురిని కూర్చోబెట్టి 100 రకాల వంటకాలను కుటుంబ సభ్యులంతా కొసరి కొసరి వడ్డించారు. అది చూసి అల్లుడు చలించిపోయాడు. ఈ వంటల్లో అది లేదు.. ఇది లేదు అని చెప్పడానికి వీలులేకుండా అన్నీ ఇంట్లోనే ఆ అత్తగారు తయారు చేయడం విశేషం.
Share