Current Date: 27 Nov, 2024

హిండెన్‌బర్గ్ ఆరోపణలపై అదానీ గ్రూప్ రియాక్ట్

అమెరికాకి చెందిన హిండెన్‌బర్గ్ ఆరోపణలతో అదానీ గ్రూప్ పూర్తిగా ఆత్మరక్షణలో పడిపోయింది. ఏడాదన్నర క్రితం ఇలానే అదానీపై  ఓ బాంబ్‌ని హిండెన్‌బర్గ్ పేల్చగా.. సుప్రీంకోర్టు వరకూ వెళ్లి క్లీన్‌‌చిట్ తెచ్చుకున్నారు. కానీ.. రెండు రోజుల క్రితం మళ్లీ హిండెన్‌బర్గ్ తెరపైకి తేవడంతో అదానీ గ్రూప్ స్పందించింది.‘హిండెన్‌బర్గ్ ఆరోపణలు పూర్తిగా తప్పుదారి పట్టించేవి, దురుద్దేశపూర్వకమైనవి. ఈ ఆరోపణలను సుప్రీంకోర్టు గతంలో తోసిపుచ్చినవి. అయినప్పటికీ మళ్లీ తెరపైకి తెచ్చింది. హిండెన్‌బర్గ్ తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఈ ఆరోపణలు  చేస్తోంది’’  అదానీ గ్రూప్ ఓ ప్రకటనని విడుదల చేసింది. హిండెన్‌బర్గ్ తాజా నివేదికలో, అదానీ సోదరుడు వినోద్ అదానీ నియంత్రణలో ఉన్న ఆఫ్‌షోర్ బెర్ముడా, మారిషస్ ఫండ్‌లలో సెబీ చీఫ్ మాధబి పురి, ఆమె భర్త ధావల్ బచ్‌లకు వాటాలున్నాయని, వాటి నికర విలువ సుమారు రూ.83 కోట్ల రూపాయలుగా ఉందని తెలిపింది. ఈ ఆరోపణల్ని మాధబి పురి ఇప్పటికే ఖండించారు.

Share