Current Date: 07 Oct, 2024

విశాఖ నుంచి 9 విమానాల రాకపోకలు రద్దు

ఎన్‌ఏడీ న్యూస్‌లీడర్‌, జులై 20: విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే 9 విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు అదికారులు ప్రకటించారు. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా విమాన సర్వీసులు రద్దు చేస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై వెళ్లే ప్రయాణిలు సహకరిచాల్సిందిగా కోరారు.

రద్దు చేసిన విమానాలు వివరాలు :6ఈ6408 హైదరాబాద్‌ - విశాఖపట్నం (విశాఖకు రావల్సిన విమానం)

6ఈ779 విశాఖపట్నం - హైదరాబాద్‌ (విశాఖ నుండి వెళ్లవలసిన విమానం)

6ఈ217 బెంగళూరు - విశాఖపట్నం (విశాఖకు రావల్సిన విమానం)

6ఈ557 చెన్నై - విశాఖపట్నం (విశాఖకు రావల్సిన విమానం)

6ఈ845 విశాఖపట్నం - చెన్నై (విశాఖ నుండి వెళ్లవలసిన విమానం)

6ఈ879 హైదరాబాద్‌ -విశాఖపట్నం (విశాఖకు రావల్సిన విమానం)

6ఈ6645 విశాఖపట్నం - హైదరాబాద్‌ (విశాఖ నుండి వెళ్లవలసిన విమానం)

6ఈ6366 బెంగళూరు - విశాఖపట్నం (విశాఖకు రావల్సిన విమానం)    6ఈ5309 విశాఖపట్నం - బెంగళూరు (విశాఖ నుండి వెళ్లవలసిన విమానం)

Share