Current Date: 27 Nov, 2024

టీమిండియా కోచ్‌గా విరాట్ కోహ్లీ బద్ధశత్రువు!

భారత మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ హెడ్ కోచ్‌గా దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. న్యూయార్క్‌లో ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌ 2024తో రాహుల్‌ ద్రవిడ్‌ పదవీకాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో కొత్త కోచ్‌గా గంభీర్‌ ప్రకటన ఉండబోతోంది.ఐపీఎల్‌ 2024లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టుకు మెంటార్‌గా ఉన్న గంభీర్.. ఆ జట్టు టైటిల్‌ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. దీంతో అతడిని టీమిండియా హెడ్‌కోచ్‌గా తీసుకోవాలని డిమాండ్‌ తెరపైకి వచ్చింది. అయితే ఇందుకోసం బీసీసీఐ కూడా గంభీర్‌ను సంప్రదించింది.కానీ ఇక్కడే గంభీర్‌ ఒక కండీషన్‌ పెట్టాడట. తాను కోచ్‌గా రావాలంటే సహాయ సిబ్బంది నియమించుకునే స్వేచ్ఛ తనకు ఇవ్వాలని డిమాండ్‌ చేశాడట. ఈ కండీషన్‌కు బీసీసీఐ ఒప్పుకుందని దీంతో అతడి పేరు ఖరారైనట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై జూన్‌ చివర్లో బీసీసీఐ అధికారిక ప్రకటన చేయనుంది. విరాట్ కోహ్లీ, గంభీర్ మధ్య గత కొన్నేళ్లుగా కోల్డ్ వార్ నడుస్తోంది. దాంతో గంభీర్ కోచ్‌గా వస్తే.. కోహ్లీపై ఆ ప్రభావం ఉండనుంది.

Share