Current Date: 02 Oct, 2024

ఐఏఎస్ స్మితా సబర్వాల్‌కి హైకోర్టులో ఊరట ముగిసిన వివాదం

దివ్యాంగులకు రిజర్వేషన్ల విషయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ మెంబర్, సీనియర్ ఐఏఎస్ స్మితా సబర్వాల్‌‌కు హైకోర్టులో భారీ ఊరట లభించింది. స్మితా సబర్వాల్ మీద దాఖలైన పిటిషన్లన్నింటినీ విచారణ అర్హత లేదంటూ తెలంగాణ హైకోర్టు కొట్టేసింది.దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిందిన పూజా ఖేద్కర్‌ వ్యవహారంపై స్మితా సబర్వాల్ ట్విట్టర్‌లో చేసిన వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. అఖిల భారత సర్వీసుల్లో దివ్యాంగులకు రిజర్వేషన్లు ఎందుకంటూ స్మితా సబర్వాల్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆ ఒక్క పోస్టుతో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వచ్చింది.స్మితా సబర్వాల్ అభిప్రాయాన్ని వ్యతిరేకిస్తూ.. కొంతమంది నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు స్పందిస్తూ.. దివ్యాంగులను గౌరవిస్తానని చెప్తూనే విమానయాన సంస్థ దివ్యాంగులను పైలట్‌గా నియమిస్తుందా? వైకల్యం ఉన్న సర్జన్‌ను నమ్మకంతో విశ్వసిస్తారా? అంటూ ఎదురు ప్రశ్నలు సంధించారు.స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలపై ఉవ్వెత్తున వ్యతిరేకత వచ్చింది. 

Share