Current Date: 27 Nov, 2024

ఉద్యోగాల కల్పన కోసం బడ్జెట్‌లో కీలక ప్రకటన

దేశంలో నిరుద్యోగం పెరిగిపోతోందంటూ విపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఉపాధి కల్పనే లక్ష్యంగా బడ్జెట్ 2024-25లో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఉపాధి కల్పనే లక్ష్యంగా 3 ప్రోత్సాహక పథకాలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. తొలిసారి ఉద్యోగంలో చేరిన వ్యక్తులకు తొలి జీతాన్ని కేంద్ర ప్రభుత్వమే అందించనుంది. ఈ మేరకు బడ్జెట్‌లో ప్రకటన వెలువడింది. ఈ పథకం అన్ని అధికారిక రంగాలలోనూ వర్తిస్తుందని కేంద్రం తెలిపింది. ఇంటర్న్‌షిప్ అలవెన్స్‌గా రూ.5,000, ఒకే దఫా సాయంగా రూ. 6,000 మొత్తాన్ని కలిపి ఇవ్వనున్నట్టు పేర్కొంది. ఈ పథకం కింద 500 అగ్రశ్రేణి కంపెనీల్లో ఇంటర్న్‌షిప్‌ను ప్రోత్సహించనున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.

Share