Current Date: 05 Oct, 2024

ఎన్టీఆర్ కు రిప్లై ఇచ్చిన చంద్రబాబు..

ఏపీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన నేపధ్యంలో  తెదేపా అధినేత చంద్రబాబుకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు అభినందనలు తెలిపారు. తనకు  శుభాకాంక్షలు తెలిపిన వారందరికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు తనకు అభినందనలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ కు  ఎక్స్ వేదికగా చంద్రబాబు థ్యాంక్స్ చెప్పారు. Thank you very much Amma అని రిప్లై ఇచ్చారు. ఎన్టీఆర్ తో పాటు రజనీకాంత్, మోహన్ బాబు, నాగార్జున, వెంకటేష్, మహేశ్ బాబు, సోనూ సూద్ కు ధ్యాంక్స్ చెప్పారు. బాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా, రాజ్ నాథ్ సింగ్,తమిళనాడు  సీఎం స్టాలిన్  తదితరులకు చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు.