Current Date: 09 Oct, 2024

హైదరాబాద్‌కి రా సమంతపై డైరెక్టర్ త్రివిక్రమ్ ఇంట్రస్టింగ్ కామెంట్స్

తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల కారణంగా సమంత పేరు తెలుగు రాష్ట్రాల్లో మరోసారి హాట్ టాపిక్ అయిపోయింది.రీసెంట్ టైంలో సినిమాలు చేయనప్పటికీ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తోంది ఈ హీరోయిన్. ఆలియా భట్ 'జిగ్రా' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి సమంత, డైరెక్టర్ త్రివిక్రమ్ హాజరయ్యారు.'ఏ మాయ చేశావే' సినిమా నుంచే సమంత హీరో అని, ఆమెకు వేరే ఏం అక్కర్లేదని, ఆమెనే ఓ శక్తి అంటూ ఆకాశానికెత్తేశాడు. ముంబైలోనే కాకుండా అప్పుడప్పుడు హైదరాబాద్ కూడా రండి, మీరు చేయడం లేదని మేం రాయడం లేదు, మీరు నటిస్తానంటే మేం కథలు రాస్తామని సమంతని ఉద్దేశించి త్రివిక్రమ్ అన్నాడు.'అత్తారింటికి దారేది'లాగా సమంత కోసం హైదరాబాద్ రావడానికి దారేది అని అనలేమో అని త్రివిక్రమ్ సరదాగా చెప్పుకొచ్చారు. త్రివిక్రమ్, సమంత కాంబినేషన్‌లో అత్తారింటికి దారేది, సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలు వచ్చాయి. త్రివిక్రమ్ మాటలు చూస్తుంటే.. మరో సినిమా కూడా ఈ కాంబినేషన్‌లో వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.

Share