Current Date: 09 Oct, 2024

హర్యానాలో ఫెయిలైన కాంగ్రెస్ సక్సెస్ ఫార్ములా రీజనిదే

కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ఎన్నో వాగ్దానాలు చేసింది. ఎన్నికల్లో విజయం సాధించింది. నీ పథకాలు సాఫీగా  అమలు కాక జనం అసంతృప్తితో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అతిగా వాగ్ధానాలు చేసి  గెలిచింది. కానీ.. పథకాల అమలుపై క్లారిటీ రావడం లేదు.తాజాగా హర్యానా ప్రజలు వల్లమాలిన వగ్ధానాలకి భిన్నమైన రీతిలో ఫలితాన్ని ఇచ్చారు. కాంగ్రెస్ ఇచ్చిన వాగ్ధానాలతో అక్కడ ఘన విజయం సాధిస్తుందని భావించారు. ప్రీ పోల్, ఎగ్జిట్ పోల్ సర్వేలు అన్నీ కాంగ్రెస్‌కే పట్టం కట్టాయి. కానీ ఊహించని ఓటమి చవిచూసింది.వాస్తవానికి కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో జనం వాగ్దానాలకు మోసపోయి కాకుండా, ప్రభుత్వ వ్యతిరేకత వల్లే ఓట్లు వేశారు. హర్యానాలో మాత్రం ప్రభుత్వ వ్యతిరేకత మరీ అంత తీవ్రంగా లేదు.అందుకే అక్కడ జనం వాగ్దానాలకు పడిపోకుండా మళ్లీ బీజేపీకి పట్టంకట్టారు.

Share