విశాఖ ఉక్కు కర్మాగారాన్ని జాతికి అంకితం చేయడం కోసం అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు స్టీల్ ప్లాంట్ కు వచ్చినప్పటి చిత్రం. 1992 ఆగస్టు ఒకటవ తేదీన ఈ మహత్తర కార్యక్రమం జరిగింది. అప్పటి ఉక్కు శాఖా మంత్రి సంతోష్ మోహన్ దేవ్ తో పాటు ఆనాటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన రెడ్డి ని, అప్పటి పీసీసీ అధ్యక్షులు మజ్జి తులసీ దాస్ ను కూడా చూడొచ్చు.అంతేకాదు విశాఖ ఉక్కును జాతికి అంకితం చేసే సమయాన ప్రత్యక్ష సాక్షి గా వున్న ఇప్పటి లీడర్ సంపాదకులు, ఆనాటి ఆంధ్రజ్యోతి ముఖ్య విలేకరి వీవీ రమణమూర్తి ని కూడా చిత్రం లో చూడవచ్చు.దేశం అభివృద్ధి పథంలో నడవడం కోసం ఇటువంటి ఎన్నో మహోన్నత ప్రాజెక్ట్ లను అందించిన నేత పీవీ నరసింహారావు. ఆసియా ఖండంలోనే శర వేగంగా అభివృద్ధి చెందిన నగరాల్లో విశాఖ చేరిందంటే అందుకు కారణం విశాఖ ఉక్కు కర్మాగారం. ఎంతో మంది త్యాగ ఫలం తో ఈ పరిశ్రమ ఇక్కడ నెలకొంది. దేశంలో అంత్యంత ప్రతిష్టాకరమైన భారతరత్న ను ఇచ్చి పీవీ నరసింహారావు బీజేపీ ప్రభుత్వం గౌరవించడం అందరికీ ఆనందమే. అయితే అప్పటి ప్రధాని హోదాలో పీవీ నరసింహారావు జాతికి అంకితం ఇచ్చిన విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ పరం చేయకుండా ఉంటేనే పీవీ కి బీజేపీ ప్రభుత్వం పీవీ కి ఇచ్చే నిజమైన గౌరవంగా భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే భారత దేశ దశ దిశ మార్చిన ఒక ప్రధాని జాతికి అంకితం చేసిన విశాఖ ఉక్కు ను మరో ప్రధాని మోడీ జాతిని కాదని ప్రైవేట్ కు అమ్మేయడం తగని పని.
ఇప్పటికైనా ఈ విషయమై బీజేపీ ప్రభుత్వం ఆలోచించి విశాఖ ఉక్కు ను జాతికే విడిచిపెట్టడం మంచిది.