రాష్ట్రంలో ఆహార భద్రతా ప్రమాణాల్ని మరింత పెంపొందించడానికి భారత ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ
(Food Safety and Standards Authority of India)తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.88.41 కోట్లతో మంగళవారంనాడు న్యూఢిల్లీలో ఒప్పందాన్ని (MoU) కుదుర్చుకుంది. వైద్య ఆరోగ్య శాఖా మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ సమక్షంలో ఎఫ్ఎస్ఎస్ఎఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) జి.కమలవర్ధనరావు, ఏపీ ఫుడ్ సేఫ్టీ కమీషనర్ సి.హరికిరణ్, ఎఫ్ఎస్ఎస్ఎఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇనోషి శర్మ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. మంత్రి సత్యకుమార్ యాదవ్ చొరవతో రాష్ట్రంలో ఆహార భద్రత ప్రమాణాల్ని బలోపేతం చేసేందుకు ఎఫ్ఎస్ఎస్ఎఐ ముందుకొచ్చింది. ఇందుకోసం పూర్తి సహకారాన్ని అందిస్తామని ఎఫ్ఎస్ఎస్ఎఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జి.కమలవర్ధనరావు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
Share