ఉమెన్స్ టీ20 వరల్డ్‌కప్‌లో ఈరోజు భారత్ జట్టు చావోరేవో పోరులో శ్రీలంకతో తలపడనుంది. దుబాయ్‌లో జరిగే ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే వరల్డ్‌కప్ సెమీస్ రేసులో భారత్ ఉంటుంది.. ఓడితే ఇక సెమీస్ ఆశలు వదిలేసుకోవచ్చు.అంతర్జాతీయ మహిళల టి20ల్లో శ్రీలంకపై భారత విజయాల రికార్డు 19–5తో ఎంతో ఘనంగా ఉంది. అయితే ఈ ఐదు పరాజయాల్లో చివరిది ఇటీవల ఆసియా కప్ టి20 టోర్నీ ఫైనల్లో వచ్చిది. అప్పటి వరకు అద్భుత ఫామ్‌లో చెలరేగిన హర్మన్‌ప్రీత్ కౌర్ బృందం తుది పోరులో అనూహ్యంగా పరాజయం పాలైంది.శ్రీలంకే కదా అని తేలిగ్గా తీసుకోవడానికి లేదు. ఈ వరల్డ్ కప్‌లో ముందంజ వేయాలంటే కచ్చితంగా గెలవడంతో పాటు రన్‌రేట్ మెరుగుపర్చుకోవడం కూడా భారత్‌కు ముఖ్యం. ఈ నేపథ్యంలో నేడు జరిగే గ్రూప్ ‘ఎ’ పోరులో భారత్, శ్రీలంక పోరు ఆసక్తికరంగా మారింది.
Share