Current Date: 05 Oct, 2024

బడ్జెట్ స్పీచ్ 86 నిమిషాల్లోనే క్లోజ్.. అయినా నిర్మలా రికార్డ్!

ఎన్నికల తర్వాత మోడీ సర్కార్‌ తొలి బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది. ఆర్థిక సంవత్సరం 2024-25కు పూర్తి స్థాయి బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో నిన్న చదివి వినిపించారు. ఆర్థిక మంత్రిగా వరుసగా ఏడో సారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన  ఆమె.. ఆరుసార్లు లోక్ సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన మాజీ ఆర్థిక మంత్రి మొరార్జీ దేశాయ్‌ రికార్డును బ్రేక్‌ చేశారు. కానీ.. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ స్పీచ్‌ సమయాన్నిగణనీయంగా తగ్గించుకున్నారు. నిన్న పార్లమెంటులో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన మంత్రి తన స్పీచ్‌ను కేవలం 86 నిమిషాల్లోనే ముగించారు. ఆర్థిక శాఖ మంత్రిగా ఇదే ఆమె అతి చిన్న బడ్జెట్‌ ప్రసంగం కావడం గమనార్హం. 2020లో ఆమె ఏకంగా రెండు గంటల నలభై నిమిషాల పాటు అత్యంత ఎక్కువ సమయం బడ్జెట్‌ ప్రసంగం చేసి రికార్డ్ నెలకొల్పారు. 2020లోనే కాదు.. నిర్మల తొలిసారి ఆర్థిక మంత్రి అయిన 2019లోనూ 2 గంటల 17 నిమిషాలు, 2021లో గంట 50 నిమిషాలు, 2022లో గంట 32 నిమిషాలు, 2023లో గంట 27 నిమిషాలు బడ్జెట్‌ ప్రసంగాలు చేశారు.

Share