Current Date: 27 Nov, 2024

శ్రీకాకుళం, తూ.గో నుంచి ఇసుక 8నుంచి కొత్త సాండ్‌ పాలసీ అమలు

 సోమవారం నుంచి ఇసుక కొత్త పాలసీ అమల్లోకి రానుంది. విశాఖ ప్రజల అవసరాల కోసం శ్రీకాకుళం, తూర్పు గోదావరి జిల్లాల నుంచి ఇసుకను తీసుకు వచ్చేలా అధికారులు నిర్ణయించారు. అంతేకాకుండా ఇసుక సరఫరాకు సంబంధించి జిల్లాల కలెక్టర్లకు ఏపీ ప్రభుత్వం పూర్తి అధికారాలిచ్చింది. విశాఖ జిల్లాకు సంబంధించి భీమిలి, అగనంపూడి ప్రాంతాల్లో ఇసుక నిల్వలు ఏర్పాటు చేశారు. ఇసుక కావాల్సిన వారు తమ ఆధార్‌ కార్డు పట్టుకెళ్లి 20టన్నుల సరకు తెచ్చుకోవచ్చు. తమ ఆధార్‌ కార్డు నకలును ఇసుక డిపో వద్ద ఉండే ఇన్‌చార్జికి సమర్పించాల్సి ఉంటుంది. ప్రభుత్వం నిర్దేశించిన సొమ్మును కలెక్టర్‌/జిల్లా స్థాయి ఇసుక కమిటీకి డిజిటల్‌ పేమెంట్‌ ద్వారా సొమ్ము చెల్లించొచ్చని అధికారులు చెబుతున్నారు.ఆధార్‌ కార్డు నకలుతో పాటు ప్రభుత్వం కొన్ని నిబంధనలు ప్రకటించింది. అగనంపూడి డిపో వద్ద ఇసుక కావాలంటే టన్నుకు రూ.1394 చెల్లించాలి. అదే భీమిలి వద్ద కావాలంటే టన్నుకు రూ.758చెల్లించాలి. ఉదయం 6నుంచి సాయంత్రం 6గంటల వరకు విక్రయాలు జరుపుతారని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. అంతేకాకుండా అనుమతుల్లేకుండా ఇసుక నిల్వ చేసినా, రవాణా చేపట్టినా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమస్యలేమైనా తలెత్తితే కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూం 0891`2590100 ఫోన్‌ నంబర్‌కు ఫిర్యాదు చేయొచ్చనన్నారు. కంట్రోల్‌ రూం వద్ద ఎస్‌డీసీ, డిప్యూటీ సీడీ కంట్రోలర్‌ను సంప్రదించొచ్చని విశాఖ జిల్లా గనులు, భూగర్భ శాఖ అధికారి (జిల్లా స్థాయి ఇసుక కమిటీ మెంబర్‌ కన్వీనర్‌) 

Share