Current Date: 27 Nov, 2024

దేవరకు ‘ఉక్కు’ సెగ!

దేవర సినిమాకు స్టీల్‌ ప్లాంట్‌ సెగ తగిలింది. వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణ ఉద్యమానికి జూనియర్‌ ఎన్టీఆర్‌ మద్దతు ఇవ్వాలంటూ జన జాగరణ సమితి విజ్ఞప్తి చేస్తోంది. ఈ మేరకు నగరంలోని రామా టాకీస్‌ తదితర ప్రాంతాల్లో దేవర సినిమా పోస్టర్లపై ‘‘విశాఖ ఉక్కు..ఆంధ్రుల హక్కు’’ అంటూ ప్లాంట్‌ పోస్టర్లను తగిలించింది. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను అమ్మే కుట్ర జరుగుతుందంటూ రెండ్రోజుల కిందట  జన జాగరణ సమితి పోస్టర్లు వేయించింది. చంద్రబాబు, పురందేశ్వరి, పవన్‌.. మోసగాళ్లని, లక్షల మంది కార్మికుల పొట్ట కొట్టే కార్యక్రమం జరుగుతోందంటూ ఆరోపించింది. సింహాద్రి అప్పన్న వీళ్లను శిక్షించాలని అందులో రాసింది. ఇప్పుడు దేవర సినిమా రిలీజ్‌ ఫీవర్‌ను సైతం తమ ఉద్యమానికి వేదికగా చేసుకుంది.

Share