వైసీపీకి గుడ్ బై.. అవకాశం ఇస్తే పవన్ తో సినిమా చేస్తా.. పోసాని కృష్ణమురళి ...
Nov 22, 2024
సినీ నటుడు పోసాని కృష్ణ మురళి సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించారు. ఇక మీద తాను రాజకీయాల గురించి మాట్లానని చెప్పారు. తాను ఏ పార్టీని పొగడను అని, మరే పార్టీని విమర్శించను ఏ పార్టీని సపోర్టు చేయనని అని తెలిపారు. తనను ఎవరూ ఏమీ అనలేదన్నారు. తాను ఎప్పుడు మంచి రాజకీయ నాయకులను విమర్శలు చేయలేదన్నారు. అలాగే తాను రైటర్‌ను, డైరెక్టర్‌ను, ఆర్టిస్ట్నని చెప్పారు. తనకు ఎవరిపై కోపం ఉండదన్నారు. ఎవరైనా సరే వేషం ఇస్తారని చెబితే చేస్తానని అన్నారు. లేదంటే తానే సినిమాలు తీస్తానని అన్నారు. పవన్ సినిమాలో వేషం వచ్చినా, చిరంజీవి మూవీలో వేషం వచ్చినా నటిస్తానని అన్నారు.