Current Date: 28 Nov, 2024

హైడ్రా నోటీసులపై స్పందించిన రేవంత్ రెడ్డి తమ్ముడు సామాన్లు సర్దుకుంటా!

హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ (హైడ్రా) ఇప్పుడు హైదరాబాద్ అక్రమార్కుల గుండెల్లో రైళ్లను పరుగెత్తిస్తోందీ.  చెరువులు, కుంటలను కబ్జా చేసి కట్టిన భారీ బిల్డింగులు, అపార్ట్‌మెంట్లను సైతం రాత్రికి రాత్రే నేలమట్టం చేస్తోంది. ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్- కన్వెన్షన్ సెంటర్ పాక్షిక కూల్చివేతతో హైడ్రా పేరు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి ఇంటికి కూడా నోటీసులను జారీ చేసింది హైడ్రా. శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారులు ఆయనకు నోటీసులు ఇచ్చారు. ఇంటిని ఎఫ్‌టీఎల్ లేదా బఫర్ జోన్‌లో నిర్మించివుంటే ఇంటిని కూల్చివేయాల్సి ఉంటుందనీ పేర్కొన్నారు. ఈ నోటీసులపై తిరుపతి రెడ్డి స్పందిస్తూ తన ఇల్లు అక్రమంగా నిర్మించి ఉంచి వెంటనే కూల్చివేయాలని అన్నారు. కూల్చివేసే ముందు తనకు కొంత టైమ్ ఇస్తే ఇంట్లో సామాన్లను తీసుకుని బయటకి వెళ్లిపోతానని చెప్పారు. 1995లోనే ఈ లేఅవుట్ వేశారని, అప్పటి ప్రభుత్వం దీనికి పర్మిషన్ ఇచ్చిందని చెప్పారు.

Share