ఎన్నికలకు ముందు టీడీపీ కూటమి మహిళలను లక్ష్యంగా చేసుకుని పలు హామీలు ఇచ్చింది. మొదటిది ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. ఇప్పటికే మన పొరుగున ఉన్న తెలంగాణ, కర్నాటక రాష్ట్రాలలో ఇది అమలవుతోంది. చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం తర్వాత ఏపీలోనూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీని అమలు చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పథకాన్ని విజయవంతంగా అమలు చేసేందుకు ఆర్టీసీ అధికారులు రెడీ అవుతున్నారు. మహిళా ప్రయాణికులకు ఉచిత ప్రయాణం కల్పించేందుకు ఆర్టీసీ అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రమాణ స్వీకారం పూర్తికాగానే తొలి మంత్రివర్గ సమావేశంలో ఈ పథకం అమలుకు ఆమోదముద్ర పడే అవకాశం ఉంది.