Current Date: 24 Sep, 2024

75 ఏళ్లలో లేనివిధంగా చైనా ను వణికిస్తున్న బెబింకా

చైనా ను బెబింకా వణికిస్తోంది. సోమవారం ఉదయం డ్రాగన్ ఆర్థిక నగరమైన షాంఘై ను ఈ టైపూన్ న తాకీ,విజృంభిస్తోంది. ఏడు దశాబ్దాల కాలంలో ఈ నగరాన్ని తాకిన తీవ్ర తుపాను ఇదేనని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీంతో ప్రజా జీవితం అస్తవ్యస్తమైంది. గంటకు 151 కీ.మీ. వేగంతో ఈరోజు తుపాను షాంఘై ను తాకిందని స్థానిక మీడియా వెల్లడించింది. ఈ నగరాన్ని తుపాన్లు నేరుగా తాకడం అరుదు. 1949 లో టైపూను గ్లోరియా తర్వాత షాంఘై ను తాకిన తీవ్ర తుపాను ఇదే. దీంతో  అక్కడ రెండు విమానాశ్రయాలు నుంచి రాకపోకలు సాగించాల్సిన వందల విమానాలు రద్దయ్యాయి. పలు రైళ్లు నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. పలు పార్కులు,వినోద ప్రదేశాలను తాత్కాలికంగా మూసివేశారు.

Share