Current Date: 25 Nov, 2024

ఈరోజే మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు. ఏ పార్టీ గెలిచినా 72 గంటలే టైమ్!

యావత్తు దేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు శనివారం  మొదలైంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను అధికారులు లెక్కిస్తున్నారు. అనంతరం ఈవీఎంలను తెరిచి ఓట్లను లెక్కిస్తారు. మొత్తం 288 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు చేశారు.మహారాష్ట్రలోని 288 స్థానాలుకు ఒకే దశలో పోలింగ్ నిర్వహించగా...హంగ్ వస్తుందని కొన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. దీంతో అధికార, విపక్ష కూటమిలో ఆందోళన చెందుతున్నాయి. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు సాధారణ మెజార్టీ 145. వాస్తవానికి మహాయుతికి దాదాపు మెజార్టీ సంస్థలు ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి.మహారాష్ట్రలో ఏ కూటమికి మెజారిటీ దక్కినా కేవలం 72 గంటల్లోనే కొత్త ప్రభుత్వం కొలువుదీరాల్సి ఉంటుంది. ఎందుకంటే మహారాష్ట్ర శాసనసభ కాలపరిమితి నవంబరు 26తో ముగియనుంది. ఈ నేపథ్యంలో మెజారిటీ సీట్లు గెలుపొందిన పార్టీ లేదా కూటమి అదే సమయానికి సర్కారు ఏర్పాటు చేయాలి. ఇది ఎన్డీయే, ఎంవీయూ కూటమిలను కలవరానికి గురిచేస్తోంది. 

Share