Current Date: 27 Nov, 2024

ఆర్టీసీ బస్టాండ్‌లో పుట్టిన చిన్నారికి జీవితాంతం ఫ్రీ జర్నీ!

కరీంనగర్‌లో కూమారి అనే నిండు గర్భిణీ.. తన భర్తతో కలిసి భద్రాచలం వెళ్లేందుకు బస్సు కోసం బస్ స్టేషన్‌కు చేరుకున్నారు. అయితే అదే సమయంలో ఆమెకు పురిటి నొప్పులు ఎక్కువయ్యాయి. ఈ విషయాన్ని గమనించిన కరీంనగర్ బస్టాండ్‌లోని ఆర్టీసీ సిబ్బంది వెంటనే 108 కాల్ చేసి సమాచారం అందించారు. ఆ లోగానే నొప్పులు ఎక్కువ కావడంతో.. ఆర్టీసీ మహిళా సిబ్బంది రంగంలోకి దిగారు. చీరలను అడ్డుపెట్టి కుమారికి నార్మల్ డెలివరీ చేయగా ఆడపిల్ల జన్మించింది.కరీంనగర్ బస్ స్టేషన్‌లో పురిటినొప్పులతో బాధపడుతున్న గర్భిణీకి చీరను అడ్డుకట్టి కాన్పు చేసి మానవత్వం చాటుకున్నన ఆర్టీసీ సిబ్బంది పట్ల అక్కడ ఉన్న ప్రయాణికులే కాకుండా సోషల్ మీడియాలోని నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపించారు. దీంతో మహిళకు ప్రసవం చేసిన టీజీఎస్ ఆర్టీసీ సిబ్బందిని హైదరాబాద్ బస్ భవన్‌లో ఆ సంస్థ బుధవారం అభినందించింది.ఆర్టీసీ బస్సులు, బస్ స్టేషన్‌లలో పుట్టిన పిల్లలకు జీవిత కాలం ఉచిత బస్‌పాస్‌ను ఇవ్వాలని గతంలో ఆర్టీసీ యాజమాన్యం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఆ చిన్నారికి లైఫ్ టైం ఫ్రీ జర్నీ కల్పించబోతున్నట్లు ఆర్టీసీ అధికారులు ప్రకటించారు.

Share