విజయవాడ వరద బాధితులను పరామర్శించేందుకు పవన్ కళ్యాణ్ వెళ్లకపోవడం ఇప్పుడు తీవ్ర విమర్శలకి తావిస్తోంది. మూడు రోజులుగా వరద నీళ్లలో ఉన్నామని సాయం చేసేవారు లేరంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం వరద ప్రాంతాలకు తాను రాలేనని తేల్చి చెప్పేశారు. తాను ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్నానని, అక్కడికి వెళితే బాధితులంతా మీద పడతారనే ఉద్దేశంతోనే వెళ్లలేదని చెప్పడం గమనార్హం.
గతంలో సీఎంగా ఉన్నప్పుడు వైయస్ జగన్ కూడా ఇలానే వరద ప్రాంతాలకు మొదట్లో వెళ్లేందుకు ఇష్టపడలేదు. తాను వెళితే అధికారులంతా తన చుట్టూ ఉంటారని.. అప్పుడు బాధితులకి సహాయ కార్యక్రమాలు ఆలస్యమవుతాయని చెప్పుకొచ్చారు. ఇప్పుడు పవన్ కూడా దాదాపు ఆ మాటలే చెప్పే ప్రయత్నం చేశారు. కానీ.. సీఎం చంద్రబాబు మాత్రం విజయవాడలో పడవలు వేసుకుని మరీ తిరిగేస్తున్న విషయం తెలిసిందే. వాస్తవానికి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ తరచూ ప్రజల్లోకి వెళ్లిపోయేవారు. కానీ ఇప్పుడు అధికారంలో.. అది కూడా కీలక మంత్రిత్వ శాఖలకు ప్రాతినిథ్యం వహిస్తున్న అతను ఇలా బాధ్యతా రాహిత్యంగా మాట్లాడటం తీవ్ర విమర్శలకి తావిస్తోంది.
Share