Current Date: 06 Jul, 2024

చైన్ స్నాచింగ్... క్షణాల్లో దొంగలను ఢీకొన్న బస్సు...

రోడ్ పై చైన్ స్నాచర్ల బెడద ఇటీవల పెరిగిపోయింది. అలాంటి దొంగలకు కుక్క కాటుకు చెప్పుదెబ్బ లాంటి ఘటన హారియాణాలో జరిగింది. ఆటోలో కూర్చున్న మహిళా మెడలోని చైన్ ను దొంగిలించిన ఇద్దరు దొంగలు బైక్ లో పారిపోవడానికి ప్రయత్నించారు. బైక్ స్టార్ట్ చేయగానే ఓ బస్సు వచ్చి వారిని ఢీకొట్టింది. దీంతో బతుకు జీవుడా అంటూ వారు బైక్ ను వదిలేసి పారిపోయారు.