Current Date: 06 Oct, 2024

పబ్లిసిటీ పిచ్చి హైదరాబాద్ రోడ్లపై డబ్బుని వెదజల్లిన యువకుడు

హైదరాబాద్‌లోని ట్రాఫిక్ ఎక్కువగా ఉండే రోడ్లపై డబ్బులు వెదజల్లి వాటి కోసం ఎగబడే వారిని వీడియో తీసి.. అదో గొప్ప పనిగా యూట్యూబ్‌లో ప్రమోట్ చేసుకుంటున్నాడు. కూకట్‌పల్లి ఏరియాలో ఎంత ట్రాఫిక్ ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. హఠాత్తుగా ఓ యువకుడు తన మిత్రుడితో కలిసి రోడ్ మీదకు వచ్చాడు. మొదట కొన్ని నోట్లు పైకి ఎగరవేశాడు. అక్కడ జనం విరగబడి ఏరుకుంటూంటే..నవ్వుకుంటూ వీడియో తీశాడు. ఇలా మొత్తం మూడు నాలుగు చోట్ల చేసి వీడియో లు తీసుకున్నాడు. అన్ని చోట్లా ట్రాఫిక్ జామ్ అయిపోయింది.యూట్యూబర్ పేరు హర్షగా గుర్తించారు. పవర్ హర్ష, మహదేవ్, ఇట్స్ మీ పవర్ పేరుతో సోషల్ మీడియాలో ఇతను వీడియోలు చేస్తూంటాడు. అతని వీడియోలు ఇప్పుడు వైరల్ గా  మారాయి. సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అయినా పోలీసులు ఇప్పటి వరకూ ఈ యూట్యూబర్ పై ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలుస్తోంది. డబ్బుల్ని ఇలా వెదజల్లడం నేరం అయితే ట్రాఫిక్‌లో తొక్కిసలాట జరిగేలా డబ్బుల్ని వెదజల్లడం   పలువురు ప్రాణాలకు ముప్పు తెప్పించే పనిగా ఇది అత్యంత తీవ్రమైన నేరమని చెబుతున్నారు.

Share