బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ చెంప చెళ్లుమనిపించి సస్పెన్షన్‌కు గురైన సీఐఎస్ఎఫ్ మహిళ కానిస్టేబుల్ కుల్వీందర్ కౌర్‌కు ప్రముఖ బాలీవుడ్ సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ దద్లానీ అండగా నిలిచారు. ఆమెకు మరో జాబ్ ఇచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఇన్‌స్టా వేదికగా ప్రకటించారు.తాను హింసను ఎప్పుడూ ఆమోదించనని, కానీ మహిళా కానిస్టేబుల్ చర్యను అర్థం చేసుకోగలనని పేర్కొన్నారు. సీఐఎస్ఎఫ్ ఆమెపై ఎటువంటి చర్యలు తీసుకున్నా, తాను కుల్వీందర్‌కు మరో జాబ్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని,.. జై హింద్, జై జవాన్, జై కిసాన్ అంటూ ఇన్‌స్టాలో వ్యాఖ్యానించారు.పంజాబ్ రైతుల నిరసనలపై కంగన వ్యాఖ్యలకు భగ్గుమన్న కుల్వీందర్ కౌర్ ఎంపీపై చేయి చేసుకున్నారు. చండీగఢ్ ఎయిర్‌పోర్టులో జూన్ 6న ఈ ఘటన జరిగింది.