Current Date: 07 Oct, 2024

ఆగస్టు 6న అన్ని జిల్లాల కలెక్టరేట్ కార్యాలయం ముందు ఏఐఎస్ఎఫ్ నిరసనలు

ఈ నెల 20 నుండి 30 వరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ హాస్టల్లో విద్యార్థులతో ముఖాముఖి హాస్టల్ నిద్రలు నిర్వహించి, ఆగస్టు 6న అన్ని జిల్లాల కలెక్టరేట్ ముందు శాంతియుత ధర్నాలు నిర్వహించి, విద్యార్థుల సమస్యలు ప్రభుత్వానికి తెలియజేస్తామని జిల్లా కార్యదర్శి యు నాగరాజు తెలిపారు. గత ఏడు సంవత్సరాలుగా విద్యార్థులకు అందవలసిన దుప్పట్లు, ట్రంక్ పెట్టెలు,  అలాగే తొమ్మిది నెలలుగా మెస్ చార్జీలు విడుదల చెయ్యకపోవడంతో విద్యార్థులకు మెరుగైన పౌష్టికాహారం అందించడంలో  వార్డెన్స్ విఫలమవుతున్నారన్నారు. దీని వల్ల విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యి వాళ్ల విద్యాభ్యాసం మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ హాస్టల్ కు సొంత భవనాలు కేటాయించాలని, మెనూ సక్రమంగా అమలు చేయాలని, హాస్టల్లో మౌలిక వసతులు కల్పించాలని వారు కోరారు. డిగ్రీ ఆన్లైన్ అడ్మిషన్స్ వల్ల విద్యార్థులు కోరుకున్న కళాశాలలో సీట్లు పొందలేకపోతున్నారని, కాబట్టి ఆన్లైన్ అడ్మిషన్స్ రద్దు చేయాలన్నారు.  అలాగే పీజీ విద్యార్థులకు శాపంగా మారిన జీవో నెంబర్ 77 రద్దు చేస్తామని ప్రస్తుత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చిన  హామీని నిలబెట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు. 

Share