ఓ కాంట్రాక్టర్ నుంచి రూ.25లక్షలు తీసుకుని సీబీఐకి రెడ్ హ్యాండెడ్గా చిక్కిన విశాఖ రైల్వే డీఆర్ఎం సౌరబ్ ప్రసాద్ కేసులో విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి. గతేడాది జూలైలో విశాఖలో బాధ్యతలు స్వీకరించిన సౌరబ్ ప్రసాద్ కు ముంబయిలో ఖరీదైన ఓ ఇల్లుంది. విశాఖలోని పారిశుద్ధ్య పనులకు సంబం ధించి (ప్లాట్ ఫారాలు, పరిసర ప్రాంతాల పరిశుభ్రత) మెకానికల్ అండ్ హెల్త్ విభాగ టెండర్లకు సంబంధించి ఇద్దరు వ్యక్తులు కాంటాక్ట్ పాడుకున్నట్టు తెల్సింది. మొత్తం రూ.62కోట్ల విలువైన ఈ పనుల ప్రారంభానికి డీఆర్ఎం అనుమతుల మంజూరు చేయాల్సి ఉంది. జూలైలోనే పనులకు సంబంధించి అనుమతులు అధికారికంగా లభించినా డీఆర్ఎం నుంచి కూడా ఢిల్లీ వర్గాలకు కాగితం వెళ్లాల్సి ఉంది. తనకు 10శాతం లంచం ఇవ్వాలని సౌరబ్ ప్రసాద్ డిమాండ్ చేయగా రూ.5కోట్లు మాత్రమే ఇవ్వగలమని ఆ ఇద్దరు కాంట్రా క్టర్లు ఒప్పుకొన్నట్టు సమాచారం.