Current Date: 05 Oct, 2024

చంద్రబాబు ప్రమాణ స్వీకార ముహూర్తం ఖరారు ..

 ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార ముహూర్తం ఖరారైంది. ఈ నెల 12న బుధవారం ఉదయం 11.27గంటలకు కేసరపల్లి ఐటీ పార్కు వద్ద చంద్రబాబు ప్రమాణం చేస్తారని టీడీపీ వర్గాలు తెలిపాయి. తొలుత ఈ నెల 9నే చంద్రబాబు ప్రమాణం ఉంటుందని నేతలు నిర్ణయించారు. అయితే అదే రోజున ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణం చేస్తుండడంతో చంద్రబాబు కార్యక్రమం 12కు వాయిదా వేసుకున్నారు. ఏపీలో సీఎంగా చంద్రబాబు నాలుగో సారి ప్రమాణం చేయనుండగా, ఆ మేరకు టీడీపీ నేతలు ఏర్పాట్లు చేపట్టారు. గంగవరం ఎయిర్‌పోర్టు సమీపంలోని ఖాళీ స్థలంలో భారీ ఏర్పాట్ల మధ్య బాబు ప్రమాణ స్వీకారం ఉంటుందని టీడీపీ వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉంటే ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ సహా వివిధ ముఖ్య నేతలు హాజరు కానున్నారు.