పారిస్ ఒలింపిక్స్‌లో అనర్హత వేటుకి గురైన భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ సంచలన నిర్ణయం తీసుకుంది. గోల్డ్ మెడల్‌కి అడుగు దూరంలో నిలిచిన ఆమె.. ఇక జీవితంలో మళ్లీ మ్యాట్‌పైకి రానంటూ రిటైర్మెంట్ ప్రకటించింది. ఒలింపిక్స్ ఫైనల్‌లో కేవలం 100 గ్రాముల ఆధిక బరువుతో వినేశ్‌కి పతకం దూరమైన విషయం తెలిసిందే."నాపై రెజ్లింగ్ గెలిచింది. నేను ఓడిపోయాను. నన్ను క్షమించండి. మీ కల, నా ధైర్యం అన్ని విచ్ఛిన్నం అయ్యాయి. ఇక నాకు పోరాడే ఓపిక, శక్తి లేదు. అందుకే 13 ఏళ్ల కెరీర్‌కి స్వస్తి పలుకుతూ.. రెజ్లింగ్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నా’’ అని వినేశ్ ప్రకటించింది.ఒలింపిక్స్‌లో మహిళల 50కేజీల విభాగంలో పోటీపడుతూ ఫైనల్‌కి చేరిన వినేశ్.. తుది పోరుకి ముందు 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉండటంతో అనర్హతకి గురవడం 140 కోట్ల భారతీయుల్ని బాధపెట్టింది.
Share