విశాఖపట్నం, న్యూస్‌లీడర్, జూన్ 1: విశాఖ వాసులకు చల్లని కబురు. ఎండవేడిమితో కుతకుతలాడిపోతున్న నగర వాసులకు మరో మూడ్రోజుల పాటు చల్లదనమే ఉంటుందని వాతావరణశాఖ నిపుణులు అంచనా వేశారు. శుక్రవారం అర్ధరాత్రి దాటాక విశాఖలో భారీ ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడిరది. ఇన్నాళ్లూ భరించలేనంతగా ఉక్కపోత కనిపించినా శనివారం తెల్లవారుజాము వరకు పడిన వర్షం కాసింత ఉపశమనం కలిగించింది. ఈదురు గాలుల కారణంగా పలు చోట్ల చెట్టు నేలకొరిగాయి. డ్రైనేజీలు పొంగిపొర్లాయి. రోడ్లన్నీ వర్షపునీటితో నిండాయి. రాత్రి వేళ కావడంతో అంతా సేద తీరారు. నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. శనివారం ఉదయం నాటికి మళ్లీ తెరిపించింది. ఎండలు సాధారణంగానే కనిపించాయి.