Current Date: 02 Jul, 2024

పవన్ సమావేశానికి అల్లు అరవింద్

పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారానికి రాని అల్లు అరవింద్ సోమవారం సినీ నిర్మాత ల సమావేశానికి మాత్రం హాజరయ్యారు. పవన్ ఉప ముఖ్య మంత్రి పదవిని చేపట్టిన రోజు న అల్లు అరవింద్ తో సహా అల్లు ఫ్యామిలీ మొత్తం డుమ్మా కొట్టిన విషయం తెలిసిందే. అయితే ఏమయిందో ఏమో నిర్మాతల సమావేశానికి అల్లు అరవింద్ రావడం అందర్నీ ఆశ్చర్యపరిచింది.తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు, రాష్ట్రంలో సినిమా రంగం అభివృద్ధికి ఉన్న అవకాశాలు,  సినీ రంగం విస్తరణకు ఉన్న అవకాశాలపై ఈ సమావేశం లో చర్చించారు. సినీ పరిశ్రమ ఇబ్బందులను పవన్ కళ్యాణ్  కు నివేదించారు.ఈ సమావేశంలో రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తో పాటు నిర్మాతలు  సి అశ్వినీదత్, ఏ.ఎం. రత్నం, ఎస్.రాధాకృష్ణ (చినబాబు), దిల్ రాజు,  బోగవల్లి ప్రసాద్, డి.వి.వి.దానయ్య , శ్రీమతి సుప్రియ,  ఎన్.వి.ప్రసాద్,  బన్నీ వాసు, నవీన్ ఎర్నేని, నాగవంశీ,  టి.జి.విశ్వప్రసాద్, వంశీ కృష్ణ తదితరులు ఉన్నారు.

Share