Current Date: 25 Nov, 2024

సామాన్యుడిగా క్యూ లైన్‌లో మాజీ ఎమ్మెల్యే.. సాదాసీదా జీవితం

ఒక్కసారి ఎమ్మెల్యేగా చేస్తేనే ఒకరకమైన హోదా మెయిన్‌టెన్ చేస్తుంటారు.అలాంటిది ఏకంగా 5 సార్లు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇల్లందు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పని చేసిన గుమ్మడి నర్సయ్య అధికార దర్పానికి, అర్బాటాలకు దూరంగా ఉంటూ.. నీతి, నిజాయితీతో సాదాసీదా జీవితాన్ని గడుపున్నారు. పదవిలో ఉన్నంతకాలం బస్సు, ట్రైన్‌లలోనే హైదరాబాద్ వచ్చి విద్యానగర్‌లోని పార్టీ ఆఫీసులో పడుకుని.. ఆటోలో అసెంబ్లీకి వచ్చేవారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నడిపించే ఫుడ్‌ సెంటర్‌లో రూ.5 భోజనం చేసే గుమ్మడి నర్సయ్య.. ముందు నుంచి పబ్లిసిటీకి, అవినీతికి దూరంగా ఉండేవారు. అందుకే ఆయనకు ఊర్లో కొద్దిపాటి పొలం తప్పా ఆస్తులేమి లేవు.తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని ఎల్‌వీ ప్రసాద్‌ ఆస్పత్రిలో కంటి పరీక్షల కోసం వచ్చిన గుమ్మడి నర్సయ్య  ఎమ్మెల్యే అన్న ప్రోటోకాల్‌కు దూరంగా సామాన్యునిడిగా వ్యవహరించి మరోసారి తన నిరాడంబరతను చాటుకున్నారు. అందరితో పాటే ఓపీ చీటీ తీసుకుని.. డాక్టర్ గది ముందు క్యూలో నిలుచుని  తన వంతు వచ్చేవరకు ఓపికగా ఎదుచూసారు. తన వంత వచ్చాక కంటి పరీక్ష చేయించుకుని వెళ్లిపోయారు.

Share