Current Date: 27 Nov, 2024

పది వేలు కాదు పది కోట్ల తో సమానం

తను దాచుకున్న పది వేల రూపాయలను  టీడీపీ పార్టీకి విరాళం గా ఇచ్చిన దివ్యాంగ బాలిక కళ్ళల్లో ఆనందం చూసి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు కరిగిపోయారు. ఈ బాలిక ను స్వయంగా ఆమె తల్లితండ్రులు నిమ్మల దగ్గరకు తీసుకువెళ్లారు. ఎంతో కాలంగా మీ దగ్గరకు తీసుకు వెళ్ళమని అడుగుతోందని నిమ్మలకు వారు వివరించారు. పుట్టుక తోనే వారసత్వ సమస్య వల్ల  ఈ బాలిక ఇబ్బంది పడుతోంది. అయినా ఈ బాలిక కు రాజకీయ అవగాహన బాగా ఉందని ఆమె తల్లిదండ్రులు చెప్పారు. ఈ బాలికను చూసి కరిగిపోయిన నిమ్మల ఈబాలిక ఇచ్చిన పది వేలు పది కోట్లతో సమానమని తబ్బిబ్బి అయ్యారు. బాలికను ఆప్యాయత తో కూర్చోబెట్టి కాస్సేపు ముచ్చడించడం తో ఆబాలిక తో పాటు ఆమె తల్లితండ్రులు కూడా పరవశించి పోయారు.

Share