Current Date: 26 Nov, 2024

ఎడతెరపిలేని వర్షాలకు ప్రమాదకర స్థాయిలో రైవాడ జలాశయం

ఎడతెరపిలేని భారీ వర్షాలకు దేవరాపల్లి మండలం రైవాడ జలాశయం ప్రమాద స్థాయికి చేరింది. పూర్తి స్థాయి మట్టానికి రెండు మీటర్ల దూరంలో వుంది. ప్రస్తుతం నీటి మట్టం 111.00 మీటర్లకు సమీపంలో వుంది. జలాశయంలోకి సుమారు 2000 క్యూసెక్కల వరద నీరు చేరింది. ఒకవేళ నీటి మట్టం 113.00 మీటర్లు చేరువలోకి వస్తే స్పిల్‌ వే గేట్స్‌ తెరచి నదిలోకి నీటిని విడిచిపెట్టడం జరుగుతుంది. వరద నీరు పెరిగితే నీరు కిందకు వదిలే పరిస్థితి ఉన్నందున లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా వుండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. అందుకని దేవరాపల్లి, కె.కోటపాడు, చోడవరం, అనకాపల్లి, కశింకోట, మునగపాక, యలమంచిలి, రాంబిల్లి, తదితర మండలాల్లో నదీ ప్రవాహం ప్రాంతంలో నివాసముంటున్న వారంతా అప్రమత్తంగా వుండాలని అధికారులు సూచించారు. మండలాలికి సంబంధించి పంచాయితీ, రెవెన్యూ, పోలీస్‌ అధికారులు అందరూ కూడా  ప్రజలని అప్రమత్తం చేయాలని, గ్రామాల్లో దండోరా వేయించడం,  నదీ ప్రవాహం లోనికి ఎవ్వరినీ దిగరాదని అప్రమత్తం చేయగలరని తెలియజేశారు. 

Share