Current Date: 27 Nov, 2024

కొండా సురేఖకి నాగార్జున చిన్న కొడుకు అఖిల్ మాస్ వార్నింగ్

అక్కినేని ఫ్యామిలి, సమంతపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తెలంగాణ మాజీ మంత్రి కొండా సురేఖపై లేటుగానైనా ఘాటుగా స్పందించాడు అక్కినేని అఖిల్. ఇప్పటికే చిరంజీవి, వెంకటేశ్, మహేష్ నుంచి మొదలుపెడితే హీరోలంతా స్పందించారు. ఇండస్ట్రీ మొత్తం ఏకమైందిఅక్కినేని ఫ్యామిలీలో కూడా అంతా స్పందించారు. కానీ.. అఖిల్ మాత్రం రెండు రోజులు ఆలస్యంగా రియాక్ట్ అయ్యాడు. “కొండా సురేఖ ప్రవర్తించిన తీరు సిగ్గుచేటు, క్షమించరానిది. ఆమె వల్ల గౌరవనీయమైన, నిజాయితీగల కుటుంబ సభ్యులు గాయపడ్డారు. నలుగురిలో అగౌరవానికి గురయ్యారు. ఆమె స్వార్థపూరితంగా గెలవడానికి ప్రయత్నిస్తున్న రాజకీయ యుద్ధంలో, తన కంటే చాలా ఉన్నతమైన విలువలు, అవగాహన ఉన్న అమాయక వ్యక్తులపై సిగ్గు లేకుండా దాడి చేశారు. తన రాజకీయాల కోసం వాళ్లను బలి పశువులను చేశారు” అంటూ అఖిల్ రాసుకొచ్చాడు. అక్కినేని కుటుంబ సభ్యుడిగా, సినీ పరిశ్రమకు చెందిన ఓ వ్యక్తిగా ఈ విషయంలో తను మౌనంగా ఉండలేనని స్పష్టం చేసిన అఖిల్.. సమాజంలో కొండా సురేఖకు స్థానం లేదన్నాడు. ఆమెను సహించేది లేదని, క్షమించేది లేదని ప్రకటించాడు.

Share