Current Date: 27 Nov, 2024

జి ఓ 596 అసైన్డ్ భూముల అక్రమ కొనుగోల్లుపై సీపీకి విదసం పిర్యాదు

విశాఖలో 596 జి ఓ ద్వార హక్కుదారు పట్టాలు మంజూరు అయిన భూములు కొనుగోలులో జరిగిన మోసాలపై  దర్యాఫ్తు జరపాలని విదసం (విస్తృత దళిత సంఘాల)  ఐక్య వేదిక సభ్యులు పోలీసు కమిషనర పోలీసు కమిషనర్ శంఖ భ్రత బాగ్చికు బుధవారం ఫిర్యాదు చేశారు. ఈ భూ కుంభకోణంపై దర్యాఫ్తు జరిపి బినామీల గుట్టు బయట పెట్టాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం సంఘం రాష్ర్ట కన్వీనర్ డాక్టర్  బూసి వెంకటరావు మాట్లాడుతూ నెల రోజుల వ్యవధిలో వందల ఎకరాల అసైన్డ్ భూములను నలుగురు, ఐదుగురు వ్యక్తుల పేరు మీద రిజిస్టర్ అయ్యాయన్నారు. పెద్ద మొత్తాలలో  కొన్న సూరెడ్డి త్రిలోక్, సుభాష్, కాలకొండ భరత్, అగర్వాల్ అనే వ్యక్తుల అసైన్డ్ భూములను ప్రీ హోల్డ్ కోసం జిల్లా కలెక్టరును దొడ్డిదారిలో వాడుకున్నారని ఆరోపించారు. ఈ భూముల మార్కేట్ విలువ రెండు నుండి మూడు కోట్లు ఉండగా, బినామీలు దళితులపై బెదిరింపులకు పాల్పడి, ఎకరా రూ.5 లక్షలకే కోనుగోలు చేశారని, ఇందుకు పాత కలెక్టరు సహకరించడం ఐ ఎస్ ఎస్ పదవికే కళంకం అని తెలిపారు.  ప్రీ హోల్డ్ భూముల ఇన్సైడ్ ట్రేడింగ్ పై సీపీ  ప్రత్యెక దర్యాఫ్తు జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని కోరమన్నారు.

Share